Sevadas: శత దినోత్సవ వేడుకలా ఉంది: మంత్రి తలసాని

Talasani srinivas Yadav Comments On Devadas Movie - Sakshi

సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం‘సేవాదాస్’.కె.పి.ఎన్. చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై  ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో అత్యంత కోలాహలంగా జరిగింది. 

బంజారా సంప్రదాయపు డప్పులు, నృత్యాలు, వేషధారణలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించిన ఈ వేడుకలో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ బానోత్, రేఖా శ్యామ్ నాయక్, రెడ్యా నాయక్, శంకర్ నాయక్‌, రాములు నాయక్,  రవీంద్ర నాయక్‌, రాథోడ్‌ బాబూరావులతో పాటు పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  మంత్రి తలసాని మాట్లాడుతూ... ‘ఇది ఆడియో వేడుకలా లేదు. శత దినోత్సవ వేడుకలా ఉంది. ‘సేవాదాస్’ చిత్రం కచ్చితంగా 100 రోజులాడాలి. ఆ వేడుకకు కూడా ముఖ్య అతిధిగా నన్ను పిలవాలి’అన్నారు. బంజారా బిడ్డలు బంజారా భాషలోనే కాకుండా తెలుగు-ఇంగ్లీష్-హిందీ భాషల్లో తీసిన "సేవాదాస్" ఆడియో ఫంక్షన్ లో పాల్గొనడం గర్వంగా ఉంది’అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్‌.

నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ మాట్లాడుతూ... " "సేవాదాస్" రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈనెల 15న ఇల్లందులో ప్రి-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఈనెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’అన్నారు. చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ, రేఖ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి భోలే షావలి సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top