
మరికొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి హఠాత్తుగా ఆగిపోతుంది. కారణం.. పెళ్లి కూతురు కనిపించకపోవడమే. మరి..పెళ్లి కూతురు ఎక్కడ? ఈ విషయాన్ని తెలుసుకునే పనిలోనే బిజీ అయ్యారు తాప్సీ, ప్రతీక్ గాంధీ. వీరిద్దరూ ప్రధాన తారాగణంగా హిందీలో రూపొందుతున్న సినిమా ‘ఓ లడకీ హై కహాన్?’. అర్షయ్ సయ్యద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తతం ఈ సినిమా షూటింగ్ జైపూర్‌లో జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.