కాంబినేషన్‌ రిపీట్‌ | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ రిపీట్‌

Published Fri, Jul 29 2022 1:01 AM

Surya turns gangster again for Sudha Kongara directorial - Sakshi

హీరో సూర్య – దర్శకురాలు సుధ కొంగరది హిట్‌ కాంబినేషన్‌. సూర్య హీరోగా సుధ దర్శకత్వంలో రూపొందిన ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దు రా’) మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఈ చిత్రానికి ఐదు అవార్డులు దక్కాయి. కాగా సుధ కొంగర దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సూర్య అంగీకరించారు.

గ్యాంగ్‌స్టర్‌ కథతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో సుధ పేర్కొన్నారు. అయితే ఈ సినిమా ఆరంభానికి కొంత టైమ్‌ పడుతుంది. ప్రస్తుతం బాల దర్శకత్వంలో సూర్య ‘వణంగాన్‌’ (తెలుగులో ‘అచలుడు’) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుధ దర్శకత్వంలో సూర్య చేసే సినిమా ఆరంభం అవుతుందని సమాచారం. పక్కా మాస్‌ మసాలా కథతో కమర్షియల్‌ చిత్రంగా సుధ తెరకెక్కించనున్నారని తెలిసింది.

 
Advertisement
 
Advertisement