
దసరా సందర్భంగా విడుదలైన కాంతార సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. దీంతో జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ హిందీ సినిమా ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ (Sunny Sanskari Ki Tulsi Kumari) సరికొత్త ప్లాన్ వేసింది. కాంతారను తట్టుకునేందుకు మేకర్స్‌కు మరోదారి లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాంతారతో పోటీ తట్టుకోవడం కష్టమని భావించిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి చిత్ర యూనిట్ ఇప్పుడు వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో నిర్మాతలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా ప్రకటించారు. ప్రేమికులకు ఈ సీజన్‌లోన గొప్ప ఆఫర్ అంటూ తెలిపారు. టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగదారులు ఆఫర్‌ను పొందడానికి SSKTK కోడ్‌ను ఉపయోగించాలని సూచించారు.
సన్నీ సంస్కారి కి తులసి కుమారి చిత్రం కూడా అక్టోబర్ 2న విడుదలైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 నెట్ కలెక్షన్లు సాధించింది. కాంతార చిత్రానికి క్రేజ్ పెరగడంతో ఈ మూవీ కలెక్షన్స్‌పై ఎక్కువ ప్రభావం చూపింది. దీంతో వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తుంది.