సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' రిలీజ్ డేట్ ఫిక్స్ | Sakshi
Sakshi News home page

సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' రిలీజ్ డేట్ ఫిక్స్

Published Tue, Dec 26 2023 12:04 PM

Suhas Ambajipeta Marriage Band Movie Release On Feb 2nd 2024 - Sakshi

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. ఇందులో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి అనే పాత్రని సుహాస్ చేశాడు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. ఇప్పుడీ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. 

(ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వహకులు షాకింగ్ డెసిషన్)

కామెడీ డ్రామా కథతో తీస్తున్న'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో శివాని నాగరం హీరోయిన్ కాగా శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. శేఖర్ చంద్ర సంగీతమందించారు. కొన్నిరోజుల 'గుమ్మ' అనే సాంగ్ రిలీజ్ చేయగా, సంగీత ప్రియుల్ని అది ఆకట్టుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే)

Advertisement
 
Advertisement