ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఓటీటీల్లో ఈ సినిమాలు డోంట్ మిస్ | Friendship Day 2025 Special Telugu Movies In OTT | Sakshi
Sakshi News home page

Friendship Day 2025: ఈ మూవీస్ చూస్తూ మీ స్నేహాన్ని గుర్తుచేసుకోండి!

Aug 3 2025 7:00 AM | Updated on Aug 3 2025 12:20 PM

Friendship Day 2025 Special Telugu Movies In OTT

స్వచ్ఛమైన స్నేహం దొరికినవాడు అదృష్టవంతుడు. కాకపోతే ఈ రోజుల్లో అలాంటిది లభించడం చాలా అరుదనే చెప్పొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ వల్ల నేరుగా కలిసి మాట్లాడటం కంటే సోషల్ మీడియాలోనే చాటింగ్, రీల్ షేర్స్ చేస్తూ స్నేహం చేస్తున్నారు. ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోవడం వల్లే ఈ చిక్కంతా వచ్చింది. గతంతో పోలిస్తే ఫ్రెండ్స్‌ని కలిసే సందర్భాలు కూడా చాలా తగ్గిపోయాయి. మిగతా రోజుల్లో ఏమో గానీ ఈ ఫ్రెండ్‌షిప్ రోజున అయినా వెళ్లి కలిసి మనసారా తిని ఓ మంచి సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు.

అన్నట్లు సినిమా అంటే గుర్తొచ్చింది. తెలుగులో స్నేహం అనే బంధంపై బోలెడన్ని సినిమా వచ్చాయి. వస్తున్నాయి. ఈ స్నేహితుల దినోత్సవం నాడు మీ ఫ్రెండ్స్‌తో అలా కబుర్లు చెప్పుకొంటూ ఈ సినిమాలు కూడా చూడండి. మీ స్నేహ బంధంలో మరిన్ని జ్ఞాపకాల్ని పోగు చేసుకోండి. ఇంతకీ తెలుగులో ఫ్రెండ్‌షిప్ డే బ్యాక్ డ్రాప్ మూవీస్ ఏంటి? అవి ఏ ఓటీటీల్లో ఉన్నాయి?

ఈ నగరానికి ఏమైంది?
ఈ జానర్‌లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసి, అనుకోకుండా గోవా వెళ్లి అక్కడ చేసే అల్లరే ఈ చిత్రం. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. చూడండి మనసారా నవ్వుకోండి.

హ్యాపీడేస్
ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఇది. కాలేజీ, ఫ్రెండ్‌షిప్ అనే పాయింట్‌తో తీశారు. యూట్యూబ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది.

ఆర్య, ఆర్య 2
అల్లు అర్జున్ చేసిన ఈ సినిమాలో ఓవైపు స్నేహాన్ని చాలా చక్కగా చూపిస్తూనే మరోవైపు లవ్ స్టోరీని మిక్స్ చేసిన విధానం భలే క్యూట్‌గా ఉంటుంది. ఇవి రెండు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఉన్నది ఒకటే జిందగీ
రామ్, శ్రీవిష్ణు స్నేహితులుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత క్లిక్ కాలేదు. 'ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే' లాంటి సాంగ్ ఈ మూవీకి ప్లస్. కుదిరితే చూసేయండి. యూట్యూబ్‌తో పాటు జీ5లో అందుబాటులో ఉంది.

ఎవడే సుబ్రమణ్యం
తనని పిచ్చిగా ప్రేమించే చనిపోతే అతడి అస్థికల్ని తీసుకునే హిమాలయాలకు వెళ్లే ఫ్రెండ్. ఈ ప్రయాణంలో తనని తాను ఎలా తెలుసుకున్నాడనేది స్టోరీ. నాగ్ అశ్విన్ ఫస్ట్ మూవీ. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. సన్ నెక్స్ట్ ఓటీటీలో ఉంది.

ఆర్ఆర్ఆర్
రామ్ చరణ్-ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా కల్పిత కథనే అయినప్పటికీ స్నేహాన్ని చాలా చక్కగా రిప్రెజంట్ చేశారు. జీ5 ఓటీటీలో ఉంది. కుదిరితే మరోసారి ఓ లుక్కేసేయండి.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
శేఖర్ కమ్ముల తీసిన మరో క్యూట్ మూవీ. ఓ కాలనీలో ఉండే కొందరు మిడిల్ క్లాస్ కుర్రాళ్లు.. ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? స్నేహం కోసం ఎంత వరకు వెళ్లారనేది ఈ సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.

కేరింత
ఇది కూడా హ్యాపీడేస్ తరహాలో తీసిన కాలేజీ డ్రామా. ఈ సినిమాలోనూ ప్రేమ అనే పాయింట్ ఉంటుంది కానీ దానికంటే స్నేహం గొప్పతనాన్ని క్యూట్ అండ్ స్వీట్‌గా చూపించారు. హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.

జాతిరత్నాలు
ముగ్గురు ఆకతాయి ఫ్రెండ్స్.. గ్రామం నుంచి సిటీకి వచ్చి చేసిన కొన్ని పనుల వల్ల ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు అనేది కామెడీగా చూపించిన సినిమా. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. మళ్లీ ఓసారి చూసినా అస్సలు బోర్ కొట్టదు.

బ్రోచేవారెవరురా
ఇది కూడా ముగ్గురు ఫ్రెండ్స్.. ఓ అమ్మాయితో కలిసి చేసిన స్నేహం వల్ల ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు. వీళ్ల నలుగురు జర్నీ ఏంటనేది స్టోరీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. చూడకపోతే డోంట్ మిస్.

ఇప్పటివరకు చెప్పిన పది చిత్రాలతో పాటు 'హుషారు' (అమెజాన్ ప్రైమ్), ఇద్దరు మిత్రులు, నీ స్నేహం, స్నేహం కోసం, ప్రేమదేశం లాంటి సినిమాలు కూడా ఈ ఫ్రెండ్‌షిప్ డే నాడు చూసి మీ స్నేహాన్ని మరోసారి గుర్తుచేసుకోండి. 'హుషారు' తర్వాత చెప్పన నాలుగు మూవీస్ యూట్యూబ్‌లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement