వెండితెరపై స్టార్స్‌ను కలిపిన సూపర్‌ హిట్‌ కథలు | Sakshi
Sakshi News home page

వెండితెరపై స్టార్స్‌ను కలిపిన సూపర్‌ హిట్‌ కథలు

Published Sun, Sep 17 2023 4:59 AM

Star actors in guest roles in the top movies - Sakshi

కొన్ని కథల్లో అతిథి పాత్రలకు కూడా ‘స్టార్‌’ రేంజ్‌ యాక్టర్లు కావాల్సి వస్తుంది. కథలో ఆ పాత్రలకు అంత ప్రాధాన్యం ఉంటుంది. ఆప్రాధాన్యాన్ని గ్రహించి అతిథి పాత్రలకు స్టార్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తారు. అలా కొన్ని క్రేజీ కాంబినేషన్స్‌ని కొన్ని కథలు కలిపాయి. ఆ కాంబినేషన్స్‌ గురించి తెలుసుకుందాం.

కల్కి కలిపింది
ప్రభాస్‌ హీరోగా రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, లోక నాయకుడు కమల్‌హాసన్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా ఇద్దరు లెజెండరీ నటులను, ఒక స్టార్‌ డైరెక్టర్‌ని ‘కల్కి’ కలిపింది. భారతీయ ఇతిహాసం మహాభారతం స్ఫూర్తితో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్‌ కర్ణుడిని ΄ోలిన పాత్రలో కనిపించనున్నారని టాక్‌. అమితాబ్‌ క్యారెక్టర్‌ మహాభారతంలోని అశ్వథ్థామ పాత్రను ΄ోలి ఉంటుందని భోగట్టా. అలాగే కమల్‌హాసన్‌ విలన్‌ పాత్ర ΄ోషిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళిది అతిథి పాత్ర. ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తారనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్‌ హీరోయిన్లు దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని జనవరి12 విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.  

కన్నప్పలో శివుడు?
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో స్టార్‌ హీరో ప్రభాస్‌ నటించనున్నారు. ఈ మూవీకి ‘మహాభారత’ ఫేమ్‌ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించ నున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై నటుడు, నిర్మాత మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల శ్రీకాళహస్తిలోప్రారంభమైంది. శివ భక్తుడైన కన్నప్ప, ఆయన భక్తి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. కన్నప్పగా మంచు విష్ణు నటించనున్నారు. శివుడి పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తారని టాక్‌.
 
కోలీ స్టార్‌తో టాలీ స్టార్‌
‘సార్‌’ వంటి హిట్‌ సినిమా తర్వాత తమిళ హీరో ధనుష్‌ తెలుగులో నటిస్తున్న రెండో స్ట్రయిట్‌ ఫిల్మ్‌ ‘డీ 51’ (వర్కింగ్‌ టైటిల్‌). శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించనున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో తెలుగు స్టార్‌ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారు. నాగార్జున పుట్టినరోజుని (ఆగస్టు 29) పురస్కరించుకుని ‘డీ 51’ చిత్ర నిర్మాతలు సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహనరావు ఈ చిత్రంలో ఆయన నటించనున్న విషయాన్ని వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున పాత్రకి చాలాప్రాధాన్యం ఉందని టాక్‌. ప్రస్తుత సమాజంలో నెలకొన్న అసమానతల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందట. ఈ చిత్రంలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తారు.

 వార్‌కి సిద్ధం
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో పాన్‌ ఇండియాని మించిన  స్థాయిలో స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నారు హీరో ఎన్టీఆర్‌. ఇప్పటివరకూ తెలుగు సినిమాలు మాత్రమే చేసిన ఆయన తొలిసారి పరభాషా చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న ‘వార్‌ 2’ సినిమా ద్వారా ఎన్టీఆర్‌ హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన ‘వార్‌’ (2019) సినిమాకు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ రూపొందనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement