అభిమాని 700 ​కి.మీ పాదయాత్ర: సోనూసూద్‌ రిక్వెస్ట్‌! | Sonu sood: Dont Want To Encourage To Take Trouble Of Doing This | Sakshi
Sakshi News home page

కాలినడకన వచ్చిన అభిమానిని చూసి చలించిపోయిన సోనూసూద్‌

Jun 11 2021 8:32 AM | Updated on Jun 11 2021 8:32 AM

Sonu sood: Dont Want To Encourage To Take Trouble Of Doing This - Sakshi

అభిమానిని చూసి సోనూసూద్‌ చలించిపోయాడు. అతడిని ఇంటికి ఆహ్వానించి కాసేపు అతడితో మాట్లాడాడు. అతడు తనకెంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాడని..

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే వాక్యానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తాడు నటుడు సోనూసూద్‌. సాయం కోసం అర్థించిన వారికి అయినవారిలా అండగా నిలబడ్డాడు. లాక్‌డౌన్‌లో ఎంతోంమదిని సొంతగూటికి చేర్చి వారి గుండెల్లో దేవుడిగా కొలువు దీరాడు. కరోనా బాధితులకు సాయం చేస్తూ ప్రాణదాతగా మారాడు. కష్టాల్లో ఉన్న ఎందరికో తనవంతు సాయం అందిస్తూ పేదలపాటిల పెన్నిధిగా నిలిచాడు.

సోనూ చేపడుతున్న కార్యక్రమాలను చూసి వీరాభిమానిగా మారిన వెంకటేశ్‌ అనే వ్యక్తి ఎవరూ చేయని సాహసం చేశాడు. సోనూసూద్‌ను కలిసేందుకు వికారాబాద్‌ నుంచి ముంబైకి పాదయాత్ర చేపట్టాడు. సుమారు పది రోజుల్లో 700 కి.మీ. నడిచి ఎట్టకేలకు అభిమాన నటుడిని కలిశాడు. తనకోసం కాలినడకన వచ్చిన అభిమానిని చూసి సోనూసూద్‌ చలించిపోయాడు. అతడిని ఇంటికి ఆహ్వానించి కాసేపు అతడితో మాట్లాడాడు. అతడు తనకెంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాడని పేర్కొన్నాడు. కానీ దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దని కోరాడు. 

చదవండి: సోనూసూద్‌ కోసం యువకుడి పాదయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement