బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ రెండోసారి తల్లిగా ప్రమోషన్ కొట్టేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రోజు మార్చి 29, 2026న మాకు బాబు పుట్టాడని తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని రాసుకొచ్చింది. ఇప్పటికే ఆమెకు వాయు అనే కుమారుడు ఉన్నారు. తాజాగా రెండోసారి కూడా సోనమ్ కపూర్‌కు మగబిడ్డ జన్మించారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సోనమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' అపారమైన కృతజ్ఞతతో.. ప్రేమ నిండిన హృదయాలతో మార్చి 29న మా బాబు రాకను ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబం మరింత పెద్దదైంది. బాబు రాకతో మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి. వాయు తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఇప్పుడు నలుగురితో ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు మేము కృతజ్ఞతతో ఉన్నాం. ఇట్లు ప్రేమతో సోనమ్, ఆనంద్ అండ్ వాయు' అంటూ పోస్ట్ చేసింది.
వ్యాపారవేత్తతో పెళ్లి..
ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో 'సావరియా' మూవీతో సోనమ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాంబే టాకీస్, బ్లైండ్, ప్రేమ రతన్ ధన్‌పాయో, నీర్జా, సంజు, థాంక్యూ, రాంఝన, ఖుబ్సూరత్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.


