సునీత ప్రీ వెడ్డింగ్‌.. హాజరైన రేణు దేశాయ్‌

Singer Sunitha Pre Wedding Party At Hyderabad Star Hotel - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల సింగర్‌ సునీత కు వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అంతేగాక జనవరిలో రామ్‌ను వివాహం చేసుకుంటున్నట్లు సునీత వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో వీరిద్దరూ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని ఆదివారం‌ జరుపుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్‌ హోటల్‌లో‌ ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్‌ సింగర్స్‌ హజరయ్యారు. (చదవండి: అతికొద్ది మంది సమక్షంలో సునీత పెళ్లి)

కేవలం కొద్దిమంది సమక్షం‍లో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్, యాంకర్‌ సుమ కనకాలలు సందడి చేశారు. ఇందుకు సం‍బంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే సునీత-రామ్‌ల ప్రీ వెడ్డింగ్‌కు హీరో నితిన్‌ హోస్ట్‌గా వ్వవహరించి.. కార్యక్రమానికి సంబంధించి అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నాడట. మరో విషయం ఏంటంటే సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంలో దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top