Human Trafficking Case: Singer Daler Mehndi Sentenced To Jail For 2 Years Details Inside - Sakshi
Sakshi News home page

Singer Daler Mehndi: మానవ అక్రమ రవాణా కేసులో సింగర్‌కు రెండేళ్ల జైలు శిక్ష

Jul 14 2022 6:35 PM | Updated on Jul 14 2022 7:17 PM

Singer Daler Mehndi Sentenced To Jail For 2 Years In Human Trafficking Case - Sakshi

ప్రముఖ సింగర్‌ దలెర్‌ మెహందీకి న్యాయస్థానం మరోసారి జైలు శిక్ష విధించింది. మానవ అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దలెర్‌ మెహందీతో పాటు అతడి సోదరుడిని దోషిగా నిర్ధారించిన పటియాలా జిల్లా కోర్టు వీరికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 

ప్రముఖ సింగర్‌ దలెర్‌ మెహందీకి న్యాయస్థానం మరోసారి జైలు శిక్ష విధించింది. 2003 నాటి మానవ అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దలెర్‌ మెహందీతో పాటు అతడి సోదరుడిని దోషిగా నిర్ధారించిన పటియాలా జిల్లా కోర్టు వీరికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 

కాగా దలెర్‌ మెహందీ, అతడి సోదరుడు షంషేర్‌ సింగ్‌ 'మ్యూజికల్‌ ట్రూప్‌' పేరుతో కొంతమందిని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారంటూ 19 ఏళ్ల కిందట ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 1998, 1999 సంవత్సరాలలో వీరు దాదాపు పది మందిని అక్రమంగా అమెరికాలో వదిలేశారని, ఇందుకోసం వారు భారీగా డబ్బులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దలెర్‌కు వ్యతిరేకంగా 35 కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై విచారణ జరిపిన న్యాయస్థానం వారికి రెండేళ్లపాటు జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో కొన్నాళ్లపాటు జైలులో గడిపిన ఆ అన్నదమ్ములు తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా అతడి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో వారిద్దరినీ అరెస్ట్‌ చేసి పటియాలా జైలుకు తీసుకెళ్లనున్నారు.

చదవండి: గ్లామర్‌ తప్ప యాక్టింగ్‌ రాదంటూ టార్చర్‌ పెట్టారు
నెలకు రూ. 25 లక్షలు ఇస్తాను, భార్యగా ఉండమన్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement