తొలిసారి కీ రోల్‌ చేస్తున్న శ్రుతి హాసన్‌.. నాని సినిమాలో! | Shruthi Haasan bags a key role, joins the shoot in Goa | Sakshi
Sakshi News home page

తొలిసారి కీ రోల్‌ చేస్తున్న శ్రుతి హాసన్‌.. నాని సినిమాలో!

Apr 30 2023 4:00 AM | Updated on Apr 30 2023 6:54 AM

Shruthi Haasan bags a key role, joins the shoot in Goa - Sakshi

సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’లో కథానాయికగా అలరించారు శ్రుతీహాసన్‌. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘సలార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఇంగ్లిష్‌ చిత్రం ‘ది ఐ’ కూడా ఉంది. తాజాగా నాని సినిమాలో కీలక పాత్ర చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు శ్రుతి. ఇప్పటివరకూ ప్రత్యేక పాటల్లో కనిపించిన ఈ బ్యూటీ కీ రోల్స్‌ చేయలేదు. సో.. నాని సినిమాలో చేయనున్నది శ్రుతీకి తొలి కీలక పాత్ర అవుతుంది.

ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు శ్రుతీహాసన్‌. ఇక నాని సరసన కథానాయికగా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్న ఈ చిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్‌ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్, కెమెరా: సాను జాన్‌ వర్గీస్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సతీష్‌ ఈవీవీ. 

Advertisement
 
Advertisement
Advertisement