షారుక్ జవాన్‌ ఇంకా చూడలేదా?.. అయితే ఈ బంపరాఫర్ మీ కోసమే!

Sharukh Khan Jawan Movie Tickets Buy One Get On Free - Sakshi

సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, నయనతరా జంటగా నటించిన చిత్రం జవాన్. ఈ  చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. అయితే తాజాగా ఫ్యాన్స్‌కు బిగ్ ఆఫర్ తీసుకొచ్చింది.

(ఇది చదవండి:  అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్‌లో బిగ్‌ ట్విస్ట్!)

ఈనెల 28,29, 30 తేదీల్లో సినిమా చూసేవారికి జవాన్ చిత్రబృందం ఓ బంపరాఫర్ తీసుకొచ్చింది. ఈ మూడు రోజుల్లో టికెట్ బుక్ చేసుకున్నవారికి మరో టికెట్ ‍ఫ్రీగా రానుంది. దీంతో ఒక టికెట్‌ తీసుకుని ఇద్దరు మూవీ చూసేయొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్‌లైన్‌ బుకింగ్ చేసుకున్నవారికే వర్తిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని షారుక్ ఖాన్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. ఇంకేం ఈ వీకెండ్‌లో జవాన్‌ మూవీ చూడాలనుకువారు ఈ ఆఫర్‌ను ఎంజాయ్ చేయండి.  కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top