Salim Ghouse: చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’ నటుడు కన్నుమూత

Senior Actor Salim Ghouse Died At 70 Due To Heart Attack - Sakshi

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సలీం గౌస్‌(70) గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయనకు చాతిలో నొప్పి రావడంలో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న ఆయన అరోగ్యం విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారని ఆయన భార్య అనిత సలీం తెలిపారు. సలీం మృతికి బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 

చదవండి: హీరో నిఖిల్‌ ఇంట తీవ్ర విషాదం

కాగా సిలీం గౌస్‌ హిందీ, బెంగాలిలో పలు సీరియల్స్‌లో నటించిన ఆయన  బాలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఆయన అంతం, రక్షణ, ముగ్గురు మొనగాళ్లు వంటి తదితర చిత్రాల్లో నటించారు. ఇక బాలీవుడ్‌లో సలీం గౌస్‌  ‘భారత్ ఏక్ ఖోజ్’, ‘సుబహ్‌’, ‘ఇన్కార్’ తో పాటు పలు టీవీ సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించారు. ‘సారాంశ్, మంథన్, కలియుగ్, చక్ర, మోహన్ జోషీ హాజిర్ హో, త్రికాల్, అఘాత్, ద్రోహి, సోల్జర్, మహారాజా, ఇండియన్, వెల్ డన్ అబ్బా’ వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. వీటితో పాటు సౌత్‌లోను ఆయన పలు సినిమాలు చేశారు. 1993లో మణిరత్నం ‘తిరుడా తిరుడా’లో ప్రతికథానాయకుడిగా నటించారు.

చదవండి: హీరోల మధ్య ట్వీట్ల వార్‌, బాలీవుడ్‌ స్టార్స్‌పై వర్మ సంచలన కామెంట్స్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top