ఇష్టపడి కొన్న బైక్‌ని జీవిత అమ్మేసింది : రాజశేఖర్‌ | Senior Actor Rajasekhar Made Interesting Comments About Sharwanand Biker Movie In Media Meet, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

అలా అయితేనే నేను సినిమా చేయగలను : రాజశేఖర్‌

Mar 31 2026 7:33 PM | Updated on Mar 31 2026 7:45 PM

Senior Actor Raja Sekhar Talk About Biker Movie

శర్వానంద్‌ హీరోగా నటింటిన తాజా చిత్రం ‘బైకర్‌’. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్‌ 3న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా రాజశేఖర్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

→ చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా బైకర్. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా ఇది. నా సినిమాలానే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆడియన్స్  ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

→ నేను ఏ క్యారెక్టర్ చేసిన అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను బైకర్ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. బైకర్ కథ పరంగా సూపర్ గా హిట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

→ నాకు చిన్నప్పటినుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత  బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. శేషు సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్ కి వాడడం జరిగింది. ఆ తర్వాత అదే బైక్ ని  రోజు నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి 'మీరు చాలా రిస్క్ తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్  అమ్మేశారు (నవ్వుతూ).

→ అభిలాష్ గారు చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ మీద క్యారెక్టర్ మీద చాలా గ్రిప్ ఉన్నా దర్శకుడు . ఆయన అనుకునది వచ్చేంతవరకు ఎక్కడ కూడా రాజీపడరు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న డైరెక్టర్.

→ ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి.

→ నా కుటుంబమే నా బలం.  ఈ సినిమా,  నా క్యారెక్టర్  ఇంత అద్భుతంగా రావడానికి  ఒక కారణం జీవిత, మా పిల్లలు. వాళ్ల సపోర్టు చాలా గొప్పది. ఈ సినిమా నేను చేసినప్పుడు నన్ను స్కూల్ కి డ్రాప్ చేసి మళ్లీ అక్కడి నుంచి తీసుకొచ్చే ఒక మదర్ లాగా చూసుకున్నారు.

→ కొత్త సినిమాల విషయాలకొస్తే..పవన్ సాదినేనితో 'మగాడు' అనే సినిమా చేస్తున్నాను. అది ఇంకా 20% మిగిలింది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ అనుకుంటున్నారు. అలాగే నేను రమ్య విశ్వదేవ్ శివాని కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అది షూటింగ్ జరుగుతుంది త్వరలోనే టైటిల్ రిలీజ్ చేస్తాం.  బైకర్ తో పాటు ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా నా కెరీర్లో చాలా మంచి సినిమాలు అవుతాయని నమ్మకం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement