'సర్దార్‌2' నుంచి ప్రోలాగ్‌ వీడియో.. భారీ యాక్షన్‌ సీన్స్‌లో కార్తి | Sardar 2 Karthi Movie Prolog Video Out Now | Sakshi
Sakshi News home page

'సర్దార్‌2' నుంచి ప్రోలాగ్‌ వీడియో.. భారీ యాక్షన్‌ సీన్స్‌లో కార్తి

Mar 31 2025 1:31 PM | Updated on Mar 31 2025 3:49 PM

Sardar 2 Karthi Movie Prolog Video Out Now

కోలీవుడ్‌ హీరో కార్తి (Karthi) నటించిన సర్దార్‌2 (Sardar 2) నుంచి ‘ప్రోలాగ్‌’ను  తాజాగా విడుదల చేశారు. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతుంది. ఇందులో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్( Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌.జె. సూర్య(SJ Suryah) కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022లో స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా విడుదలైన ‘సర్దార్‌’ చిత్రానికి సీక్వెల్‌గా సర్దార్‌2 మూవీని నిర్మించారు. సర్దార్‌ కొడుకు పాత్ర రా ఏజెంట్‌గా కార్తి కనిపించనున్నాడు. ఈ మిషన్‌ కంబోడియాలో జరగనుందని తెలుస్తోంది.

సర్ధార్‌ –2 చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కొద్దిరోజుల క్రితమే కార్తి డబ్బింగ్‌ పనులు కూడా పూర్తి చేశారు.  భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని, జార్జ్‌ విల్లియమ్స్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా సర్ధార్‌ –2 చిత్రం త్వరలోనే పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement