Samantha-Jr NTR: జూ.ఎన్టీఆర్‌-కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన సమంత! ఎందుకో తెలుసా?

Is Samantha Refuses Jr Ntr and Koratala Siva Project NTR 30 - Sakshi

కొరటాల శివ దర్శకత్వంలో తారక్‌ హీరోగా ఎన్టీఆర్‌ 30 చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ క్రమంలో హీరోయిన్‌ వేటలో ఉంది చిత్ర బృందం. అయితే ఇప్పటికే ఇందులో ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ పేరు వినిపించగా ఆ వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేసింది. ఆ తర్వాత రీసెంట్‌గా సమంత పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడు కొరటాల సమంతను సంప్రదించారనే వార్తలు బయటకు రావడంతో తారక్‌తో సామ్‌ మరోసారి జతకట్టనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది.

చదవండి: ‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సమంత నో చెప్పిందని టాక్‌ వినిపిస్తోంది. రెమ్యునరేషన్‌ విషయంలో డీల్‌ కుదరకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. సమంత అడిగినంత పారితోషికం మేకర్స్‌ ఇవ్వలేకపోయారట. కొరటాల ఈ మూవీ కోసం హీరోయిన్‌కి రూ. 2.5 కోట్ల ఫిక్స్‌ చేశారట. అయితే సామ్‌ మాత్రం రూ. 4 కోట్లు డిమాండ్‌ చేసిందని సమాచారం. కానీ, కొరటాల రూ. 2.5 కోట్లు మాత్రమే ఇస్తామనడంతో సామ్‌ ఈ ప్రాజెక్ట్‌ చేయనని తెగేసి చెప్పినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం కానీ సమంత కానీ స్పందించే వరకు వేచి చూడాలి. కాగా గతంలో కొరటాల-ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌లో సమంత నటించిన సంగతి తెలిసిందే.

చదవండి: నా బిడ్డకు అలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నా: స్టార్‌ హీరోయిన్‌

బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన ఈ చిత్రంలో సమంత కొద్ది సేపు మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆమెను ఫుల్‌లెన్త్‌ హీరోయిన్‌గా తీసుకోవాలని భావించిన కొరటాల ఆమెను సంప్రదించాడట. కానీ సామ్‌ మాత్రం రెమ్యునరేషన్‌ విషయంలో ఎన్టీఆర్‌ సినిమాను వదులుకోవడంతో నందమూరి ఫ్యాన్స్‌ ఆమెపై ఫైర్‌ అవుతున్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ ఆఫర్స్‌ చేతిలో ఉన్నంత మాత్రానా అంత తలపోగరు ఎందుకంటూ సమంతను తిట్టిపోస్తున్నారు. ఇకపోతే సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు చేస్తుంది. అరేంజ్‌మెంట్స్‌ ఆప్‌ లవ్‌ అనే చిత్రంతో ఆమె హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాఫ్టా విజేత ఫిలిప్‌ జాన్‌ దర్శకత్వం వహించిననున్న ఈ చిత్రంలో సామ్‌ లెస్బియన్‌ పాత్రలో నటించనుంది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top