సమంత మా ఇంటి బంగారం.. వసూళ్లకదే ప్రధాన కారణం..! | Samantha Maa Inti Bangaaram Hits 100 Crore at Box office | Sakshi
Sakshi News home page

Maa Inti Bangaaram: సమంత మా ఇంటి బంగారం.. వంద కొట్టేలా ఉందే..!

Jun 28 2026 1:32 PM | Updated on Jun 28 2026 2:52 PM

Samantha Maa Inti Bangaaram Hits 100 Crore at Box office

సమంత లీడ్‌ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా దూసుకెళ్తోంది. అభిమానుల అంచనాలకు మించి ఇప్పటికే రూ.73 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రెండో వారంలోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ముఖ్యంగా మహిళలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత మా ఇంటి బంగారం వంద కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే రెండో వారంలో సామ్ సినిమాకు పోటీగా సినిమాలేవీ లేకపోవడం మరింత కలిసి రానుంది.

థియేటర్లకు మహిళల క్యూ..

మా ఇంటి బంగారం ఇంతలా హిట్‌ కావడానికి ప్రధాన కారణం లేడీ ఓరియంటేడ్‌ కథ కావడమే. ఎలాంటి సంప్రదాయాలు తెలియని ఒక మహిళ కోడలిగా వస్తే పరిస్థితి ఏంటనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. బలమైన కథ, కథనం వల్లే ఈ సినిమాకు మహిళలు క్యూ కడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి మా ఇంటి బంగారాన్ని థియేటర్లలో ఆ‍స్వాదిస్తున్నారు. రెండో వారంలోనూ ఈ మూవీ టికెట్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. బుక్ మై షోలో ఏకంగా గంటకు ఎనిమిది వేలకు పైగా టికెట్స్ బుకింగ్‌ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే సామ్ మూవీ వంద కోట్లు కొల్లగొట్టడం ఈజీనే అనిపిస్తోంది.

వసూళ్లకు అదే ప్లస్..

ఈ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడం సమంతకు మరింత కలిసొచ్చింది. పెద్ది మూవీ థియేటర్లలో ఉన్నప్పటికీ మా ఇంటి బంగారానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ క్యూ కట్టేస్తున్నారు. ఇది వసూళ్ల  పరంగా మా ఇంటి బంగారానికి బాగా ప్లస్ అయింది. అంతేకాకుండా ఈ మూవీతో ఒక మహిళ తన కుటుంబం కోసం ఏదైనా చేయగలదనే సందేశమిచ్చారు మేకర్స్. నందిని రెడ్డి డైరెక్షన్.. సమంత యాక్షన్ ఫైట్స్ మహిళలనే కాదు.. మాస్ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకుంటున్నాయి. రెండో వారంలో ఏ సినిమా పోటీ లేకపోవడం వల్ల మా ఇంటి బంగారం వంద కోట్లు కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement