Salman Khan:అప్పడే కలిసుంటే బాగుండేది.. అమ్మాయికి సల్మాన్ ఫన్నీ రిప్లై

Salman Khan Responds About marriage proposal from fan at IIFA 2023 - Sakshi

బాలావుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బీటౌన్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే బుట్టబొమ్మ పూజా హేగ్డేతో కలిసి కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ అంటూ ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులు(ఐఫా) అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోని బాలీవుడ్ స్టార్ హీరోకు ఈవెంట్‌లో ఓ మహిళా  అభిమాని ఊహించని ప్రశ్నతో  సర్‌ప్రైజ్ ఇచ్చింది. 

(ఇది చదవండి: దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్‌ రాలేదు: పరుచూరి)

మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటూ సల్మాన్‌ఖాన్‌కు ప్రపోజ్ చేసింది ఓ అభిమాని. 'సల్మాన్ ఖాన్ నిన్ను ఇష్టపడుతున్నా. ఈ విషయం చెప్పేందుకే హాలీవుడ్ నుంచి ఇక్కడి దాకా వచ్చా. నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డా' అంటూ తన ప్రేమను వెల్లడించింది. దీనికి సల్మాన్ ఖాన్ చమత్కారంగా సమాధానమిచ్చారు. మీరు షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతున్నారా?  అంటూ జోక్ చేశారు.

(ఇది చదవండి: సారా- గిల్ డేటింగ్ రూమర్స్.. అంతలోనే విడిపోయారా?)

లేదు.. మిమ్మల్నే ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటారా? అని మరోసారి అడగ్గా.. మీరు 20 ఏళ్ల నన్ను కలిసి ఉండాల్సిందని సరదాగా బదులిచ్చారు. కాగా.. సల్మాన్‌ఖాన్‌కు గతంలో పలు బ్రేకప్‌ స్టోరీలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ప్రేమ కథల గురించి మాట్లాడారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top