RRR Movie:'ఆర్‌ఆర్‌ఆర్‌'పై బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ప్రశంసలు..

Salman Khan Praises Director Rajamouli In RRR Prerelease Event - Sakshi

Salman Khan Praises Director Rajamouli: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం.. రణం.. రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబోలో వస్తున్న ఈ ఐకానిక్‌ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం జక్కన్న. తాను తీసే ప్రతీ సినిమాను పకడ్బందీగా, అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించి సక్సెస్‌ సాధిస్తాడు రాజమౌళి. అందుకే అంతలా హైప్‌ పెరిగిపోయింది ఈ సినిమాకు. అదేకాకుండా దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌ను కూడా భారీగా ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఈవెంట్‌కు సుమారు రూ. 9 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. 

ఈ కార్యక‍్రమానికి బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్ ఖాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్‌లో డైరెక్టర్‌ రాజమౌళిపై సల్మాన్‌ ఖాన్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. 'మన దేశంలో మనకున్న అత్యుత్తమ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. మహారాష్ట్రలో 50% శాతం ఆక్యుపెన్సీ ఉంది. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ మాత్రం విడుదలకు 100% ఆక్యుపెన్సీ పొందుతుందని నేను ఆశిస్తున్నాను.' అని సల్లూ భాయ్‌ తెలిపాడు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఏ చిత్రాన్ని పోల్చవద్దని కరణ్‌తో సల్మాన్‌ అన్నాడు. తర్వాత ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల గురించి మాట్లాడుతూ 'చరణ్‌, ఎన్టీఆర్‌ సినిమా స్టార్స్‌ కాకముందు నుంచే నాకు తెలుసు. వారు ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం చాలా కష్టపడ్డారు. అది వారి శరీరాకృతిని చూస్తేనే తెలుస్తుంది.' అని ప్రశంసించాడు భాయిజాన్‌. 

అలాగే అలియా భట్‌.. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళితో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందన‍్నాడు సల్మాన్‌. తన అభిమానులందరూ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని బిగ్‌ స్క్రీన్‌పై చూడాలని సల్మాన్‌ కోరాడు. ఈ సందర్భంగా 'భజరంగీ భాయిజాన్‌' సీక్వెల్‌  వస్తున్న 'భజరంగీ భాయిజాన్‌ 2' సినిమాను ప్రకటించాడు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top