కొత్తగా అనిపిస్తుంది: వినోద్‌ కుమార్‌ విజయన్‌ | Sai Ram Shankar oka pathakam prakaram movie director vnod kumar vijayan interview | Sakshi
Sakshi News home page

కొత్తగా అనిపిస్తుంది: వినోద్‌ కుమార్‌ విజయన్‌

Feb 4 2025 2:01 AM | Updated on Feb 4 2025 2:01 AM

Sai Ram Shankar oka pathakam prakaram movie director vnod kumar vijayan interview

‘‘ఒక పథకం ప్రకారం’(oka pathakam prakaram) స్క్రీన్‌ ప్లే బేస్డ్‌ మూవీ. తెలుగు ప్రేక్షకులకు మా సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది’’ అని వినోద్‌ కుమార్‌ విజయన్‌(vnod kumar vijayan) అన్నారు. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరామ్‌ శంకర్‌(Sai Ram Shankar) హీరోగా నటించిన సీట్‌ ఎడ్జ్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘ఒక పథకం ప్రకారం’. వినోద్‌ విహాన్‌ ఫిల్మ్స్‌ –విహారి సినిమా హౌస్‌పై గార్లపాటి రమేష్‌తో కలిసి వినోద్‌ కుమార్‌ విజయన్‌ నిర్మించడంతో పాటు, దర్శకత్వం వహించారు.

శ్రీలక్ష్మి ఫిలిమ్స్‌పై బాపిరాజు ఈ సినిమాని తెలుగులో ఈ నెల 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ విజయన్‌ మాట్లాడుతూ–‘‘చిన్న వయసులోనే కేరళకి వెళ్లాను. అక్కడ చాలా చిత్రాలను నిర్మించాను.. దర్శకత్వం వహించాను. నేను చేసిన చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. 

ఫాహద్‌ ఫాజిల్, గోపీ సుందర్‌ వంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశాను. తెలుగులో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. సాయిరామ్, నేను మంచి స్నేహితులం. తనకి ‘ఒక పథకం ప్రకారం’ కథ నచ్చడంతో ఈ మూవీ చేశాం. సాయిరామ్‌తో పాటు శృతీ సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖనిగారి పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement