Hrithik Roshan Rumoured GF Saba Azad In Live-in Relationship With Imaad For 7 Years - Sakshi
Sakshi News home page

Saba Azad: అప్పుడు సహజీవనం, ఇప్పుడు హృతిక్‌తో హీరోయిన్‌ డేటింగ్‌?

Feb 2 2022 2:42 PM | Updated on Feb 2 2022 4:23 PM

Saba Azad, Naseeruddin Shah Son Imaad In Live In Relationship For 7 Years - Sakshi

హృతిక్‌ రోషన్‌ మిస్టరీ గర్ల్‌కు ఓ లవ్‌ ట్రాక్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా తనయుడు ఇమాద్‌తో 2013లో ప్రేమాయణం నడిపింది. వీళ్లిద్దరూ ఏడేళ్లపాటు సహజీవనం చేశారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కుర్ర హీరోయిన్‌ సబా ఆజాద్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఇటీవలే ముంబైలో వీరిద్దరూ డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అసలీ సబా ఎవరని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. 

సజా ఆజాద్‌.. 'దిల్‌ కబడ్డీ', 'ముజే ఫ్రెండ్‌షిప్‌ కరోగే', 'రాకెట్‌ బాయ్స్‌' చిత్రాల్లో నటించింది. కాగా గతంలో ఆమెకు ఓ లవ్‌ ట్రాక్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా తనయుడు ఇమాద్‌తో 2013లో ప్రేమాయణం నడిపింది. వీళ్లిద్దరూ ఏడేళ్లపాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ 2020 సంవత్సరంలో ఇమాద్‌, సబా విడిపోయారు. ఇక ఇటీవల హృతిక్‌ ఆమె చేయి పట్టుకుని నడవడం చూసి సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరుగుతోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. మరి వాళ్ల మధ్య లవ్‌ మొదలైందా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించేవరకు ఆగాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement