'యమదొంగ తర్వాత ఆమెకు ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా రాలేదన్నారు' | Rudrangi Movie Director Ajay Samrat Interview | Sakshi
Sakshi News home page

'యమదొంగ తర్వాత ఆమెకు ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా రాలేదన్నారు'

Published Thu, Jul 6 2023 4:31 AM | Last Updated on Thu, Jul 6 2023 7:42 AM

Rudrangi Movie Director Ajay Samrat Interview - Sakshi

'యమదొంగ’ సినిమాలో మమతా మోహన్‌ దాస్‌గారి నటనంటే నాకు ఇష్టం. ఆమె క్యాన్సర్‌ నుంచి కోలుకోవడంతో ‘రుద్రంగి’లో నటించమని కోరాను. ‘పదేళ్ల నుంచి ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా రాలేదు.. నన్ను సంప్రదించినందుకు థ్యాంక్స్‌’ అన్నారామె' అని డైరెక్టర్‌ అజయ్‌ సామ్రాట్‌ అన్నారు. జగపతిబాబు, ఆశిష్‌ గాంధీ,  మమతా మోహన్‌ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’.

అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అజయ్‌ సామ్రాట్‌ మాట్లాడుతూ– 'బాహుబలి, రాజన్న’ సినిమాలకు డైలాగ్‌ రైటర్‌గా చేశాను. ఇక నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ‘రుద్రంగి’ కథ రాసుకున్నాను.

తెలంగాణలో దొరల అణ చివేతల మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ‘రుద్రంగి’ని పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఎమోషనల్, సోషల్‌ డ్రామాగా తీశాను. రసమయిగారికి సినిమా తీయాలనే తపన ఎక్కువగా ఉంది.. నిర్మాతగా ఆయన ఏం చేయగలడో అన్నీ చేశారు. సినిమా బాగుంటే జనాలు చూస్తారు. ‘కాంతారా’కి ప్రమోషన్స్‌ కూడా పెద్దగా చేయలేదు. కానీ, జనాలు విపరీతంగా చూశారు. మా ‘రుద్రంగి’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement