RRR Movie Celebration Anthem Ethara Jenda Full Video Song Out Now - Sakshi
Sakshi News home page

RRR Movie Celebrations Song: 'ఆర్‌ఆర్‌ఆర్‌' సెలబ్రేషన్స్‌ సాంగ్‌.. పూర్తి పాట వచ్చేసింది..

Mar 14 2022 7:41 PM | Updated on Mar 14 2022 8:08 PM

RRR Movie Celebration Anthem Ethara Janda Full Song Released - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'.  ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది. సినిమా విడుదల తేది సమీపిస్తుండటంతో మూవీ ప్రమోషన్స్‌ను పెంచేసింది జక్కన్న టీం. ఇందులో భాగంగానే ఇటీవల 'ఎత్తర జెండా' అనే సెలబ్రేషన్‌ యాంథమ్‌ ప్రోమోను మూవీ టీం విడుదల చేసింది. పూర్తి పాటను సోమవారం (మార్చి 14) విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఈ సాంగ్‌ రిలీజ్‌ను తొలుత వాయిదా వేస్తున్నట్లు చెప్పి సోమవారమే విడుదల చేశారు మేకర్స్‌. 

ఈ సాంగ్‌ 'పరాయి పాలనపై.. కాలు దువ్వి.. కొమ్ములు విదిలించిన కోడి గిత్తల్లాంటి అమర వీరుల‍్ని తలచుకుంటూ' అంటూ జక్కన్న చెప్పే డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. తర్వాత 'నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా' అంటూ తారక్‌, చెర్రీ, ఆలియా కలర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ మూవీ నుంచి ఇదివరకూ రిలీజైన పోస్టర్స్‌, మేకింగ్‌ వీడియోస్‌, టీజర్, ట్రైలర్‌, పాటలు రికార్డ్‌ క్రియేట్‌ చేశాయి. దీంతో సినిమాలపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ సాంగ్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రౌద్రం.. రణం.. రుధిరం' సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement