
RK Roja To Quit Jabardasth Show: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రి వర్గంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సాక్షి టీవీతో సోమవారం ఉదయం ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యను. ఇకపై జబర్దస్త్ షోలో పాల్గొనను’ అని రోజా ప్రకటించారు.
చదవండి: యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!
కాగా, కొత్త, పాత కలయికగా 25 మందితో కూడిన కొత్త మంత్రి వర్గం కూర్పును సీఎం జగన్ ఫైనల్ చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. నూతన కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులుండగా.. సీనియారిటీ పరంగా 11 మంది మంత్రులను కొనసాగించారు. కొత్తగా మరో 14 మందికి అవకాశం కల్పించారు. మంత్రులుగా సోమవారం వీరంతా ప్రమాణ స్వీకారం చేస్తారు.