వ్యూహం ఫిక్స్‌  | Sakshi
Sakshi News home page

వ్యూహం ఫిక్స్‌ 

Published Sat, Feb 10 2024 12:36 AM

Rgv Vyooham Releasing On Feb 23rd - Sakshi

‘వ్యూహం’ సినిమా విడుదలకు రూట్‌ క్లియర్‌ అయింది. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం గత ఏడాది నవంబరు 10న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

తాజాగా ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్‌ బోర్డు క్లియరెన్స్‌ ఇవ్వడంతో ఈ నెల 23న రిలీజ్‌ చేస్తున్నట్లు రామ్‌గోపాల్‌ వర్మ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలు పన్నాయి? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వంటి కథాంశంతో ‘వ్యూహం’ రూపొందింది. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో అజ్మల్‌ నటించారు.

Advertisement
 
Advertisement