రవితేజ @ 68

Ravi Teja Next Movie With Trinadha Rao Nakkina - Sakshi

రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శ కత్వంలో ఓ సినిమా ఉండొ చ్చనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త నిజమేనంటూ ఆదివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించనున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. రవితేజకి ఇది 68వ సినిమా. ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ–స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రంలోని ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే త్రినాథరావుతో చేసే సినిమా ఆరంభమవుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top