స్పీడ్‌ పెంచిన మాస్‌ మహారాజా.. మరో యంగ్‌ డైరెక్టర్‌కి చాన్స్‌

Ravi Teja Green Signal To Young Director Vamsi Krishna Project - Sakshi

కథ నచ్చాలే కానీ.. కొత్త దర్శకులకు చాన్స్‌లు ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటాడు మాస్‌ మహారాజా రవితేజ. ఇప్పటికే ఆయన చాలా మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇటీవల క్రాక్‌ సినిమా విజయం తర్వాత రవితేజ స్పీడ్‌ పెంచాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రవితేజ. అలాగే శరత్‌ మండవ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయనున్నాడు.

వీటితో పాటు డైరెక్టర్‌ మారుతితోనూ మరో చిత్రానికి  చర్చలు జరిగాయనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ మరో యంగ్‌ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌ వినిపిస్తుంది. అడివి శేష్‌-మంచు లక్ష్మీ కాంబినేషన్‌లో వచ్చిన ‘దొంగాట’ సినిమాకు దర్శకత్వం వహించిన వంశీకృష్ణ.. ఇటీవల రవితేజకు ఓ కథ వినిపించాడట. స్టోరీ నచ్చడంతో రవితేజ వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు తాను కమిట్‌ అయిన సినిమాకు పూర్తయ్యాక ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభిస్తారట. రవితేజ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పూర్తి స్క్రిప్ట్‌ని సిద్దం చేసే పనిలో ఉన్నాడట వంశీకృష్ణ.
చదవండి:
ఆ రోజు రాత్రి ఐశ్వర్య ఇంటికి వెళ్లిన సల్మాన్‌.. దూకి చస్తానని బెదిరించి..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top