Rashmika Mandanna Turns Bridesmaid for Friends Wedding, Shares Saree Pics - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లిలో సందడి చేసిన రష్మిక.. ఫోటోలు వైరల్‌

May 16 2022 4:18 PM | Updated on May 16 2022 5:30 PM

Rashmika Mandanna Turns Bridsmaid For Friends Wedding Shares Pictures - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారామె. అయితే తాజాగా రష్మిక తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్లికి హాజరవడం కోసం షూటింగ్స్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారామె. సాంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లి కుమార్తెతో కలిసి దిగిన పలు ఫోటోలను రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసుకున్నారు. 

'ఈరోజు నా బెస్ట్‌ ఫ్రెండ్‌ రాగిని పెళ్లి. ఉదయం 4గంటలకు ఫ్లైట్‌ క్యాన్సిల్‌ కావడం, ఆ తర్వాత కూడా 4-5సార్లు ఫ్లైట్‌ ఆలస్యం కావడంతో పెళ్లికి హాజరు కాలేనేమో అనుకున్నా. కానీ దేవుని దయ వల్ల ఎట్టకేలకు పెళ్లికి వచ్చేశాను. ఇక ఈ గ్యంగ్‌లోనే నేను పెరిగాను. 17ఏళ్లుగా వీళ్లు నాకు తెలుసు. ఇప్పటికీ వీళ్లలో ఏమాత్రం మార్పు లేదు.

వీళ్లంతా నా వాళ్లు. చాలాకాలం తర్వాత వీళ్లను ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. నటిగా ఈ ప్రపంచానికి పరిచయం కాకముందు ఇలాగే ఉండేది. ఇప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు' అంటూ రష్మిక ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement