వెండితెరపై ఆపరేషన్స్ ఖుక్రీ | Randeep Hooda to star in Hindi film Operations Khukri | Sakshi
Sakshi News home page

వెండితెరపై ఆపరేషన్స్ ఖుక్రీ

May 25 2025 1:27 AM | Updated on May 25 2025 1:27 AM

Randeep Hooda to star in Hindi film Operations Khukri

మేజర్‌ జనరల్‌ రాజ్‌పాల్‌ పునియా జీవితం వెండితెరపైకి రానుంది. బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హుడా ప్రధానపాత్రధారిగా హిందీలో ‘ఆపరేషన్స్  ఖుక్రీ’ అనే సినిమా రానుంది. ఈ మిలటరీ వార్‌ డ్రామా సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘ఆపరేషన్స్  ఖుక్రీ: ది అన్స్ టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ది ఇండియన్స్  ఆర్మీస్‌ బ్రేవెస్ట్‌ పీస్‌కీపింగ్‌ మిషన్స్  అబ్రాడ్‌’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ పుస్తకం హక్కులను రాహుల్‌ మిత్రా ఫిల్మ్స్, రణ్‌దీప్‌ హుడా ఫిల్మ్స్‌ సంస్థలు సొంతం చేసుకున్నాయి. 2000లో వెస్ట్‌ ఆఫ్రికాలోని సియోర్రాలియోన్‌లో జరిగిన ఆపరేషన్స్  ఖుక్రీ వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.

యునైటెడ్‌ పీస్‌కీపింగ్‌ మిషన్స్ లో భాగంగా వెస్ట్‌ ఆఫ్రికాకి వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు, అక్కడి రెబల్‌ ఫోర్స్‌ ట్రాప్‌లో చిక్కుకుని, 75 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. ఈ సైనికుల రక్షణ రెస్క్యూ ఆపరేషన్స్ ను రాజ్‌పాల్‌ పునియా లీడ్‌ చేశారు. ఈ రాజ్‌పాల్‌ పునియాగానే రణ్‌దీప్‌ హుడా నటించనున్నారు. మరోవైపు హిందీలో ‘బదాయి హో, మైదాన్స్ ’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు అమిత్‌ శర్మ కూడా ‘ఆపరేషన్స్  ఖుక్రీ’ ఘటనల నేపథ్యంలో ఓ సినిమా తీయాలని స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement