రమ్యకృష్ణ బర్త్‌డే: రిపబ్లిక్‌ మూవీ నుంచి విశాఖ వాణి లుక్‌ | Sakshi
Sakshi News home page

Happy Birthday Ramya Krishna: రిపబ్లిక్‌ మూవీ నుంచి విశాఖ వాణి లుక్‌

Published Wed, Sep 15 2021 1:48 PM

Ramya Krishna Birthday: Republic Movie Ramya Krishna Look Out  - Sakshi

ప్రముఖ నటి ర‌మ్య‌కృష్ణ‌ బర్త్‌డే 51 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. బుధవారం(సెప్టెంబర్‌ 15) ఆమె బర్త్‌డే సందర్భంగా పలువరు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేగాక శివగామి పుట్టిన రోజున ఆమె ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు రిప్లబిక్‌ మూవీ టీం. సాయి ధరమ్‌ తేజ్‌హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్‌ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె పాత్ర లుక్‌, పేరును ప్రకటించారు.

ఇందులోని ఆమె విశాఖ వాణి అనే సీరియస్‌గా పవర్‌ ఫుల్‌ మహిళ రాజకియ నాయకురాలిగా కనిపించారు. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 2న గాంధీ జయంతి సంద‌ర్భంగా విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు నటించారు. 

 
Advertisement
 
Advertisement