ఆర్జీవీ సంచలన ప్రకటన.. ఆ హీరోతో మూవీ

Ram Gopal Varma Movie With Actor Upendra - Sakshi

రామ్‌ గోపాల్‌ వర్మ.. ఈ పేరే ఓ సంచలనం. ప్రతీ విషయంలో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ ఉంటాడు. ఒకప్పుడు ఆయన తీసిన  సినిమాలో ఏదో ఒక ట్రెండ్ సెట్టింగ్ అంశం ఉండేది. అలాంటి దర్శకుడు కొంతకాలంగా మాత్రం కాంట్రవర్సీనే తన ప్రధాన అజెండాగా మార్చుకున్నారు. ఆయన తీసిన ప్రతి సినిమాలో కాంట్రవర్సీ ఉండేలా జాగ్రత్త పడతాడు ఈ వివాదస్పద దర్శకుడు.
(చదవండి: ఏడేళ్లు.. 100 రోజుల సినిమాలు ఏడు! డైలాగులు రాసినా.. డైరెక్ట్‌ చేసినా సెన్సేషనే!)

మరోపైపు విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు కన్నడ హీరో ఉపేంద్ర. ఆయన సినిమాల్లో ఎవరూ ఊహించని విధమైన స్క్రీన్‌ ప్లేతో పాటు.. సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చే విధంగా కూడా ఉంటాయి. ఇలాంటి విభిన్న దర్శకుడు, నటుడు కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది.త్వరలోనే ఈ సరికొత్త కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతుంది. 

ఉపేంద్ర పుట్టిన రోజు(సెప్టెంబర్‌ 18)సందర్భంగా ఆయనకు విషెస్‌ చెప్పిన ఆర్జీవీ.. త్వరలోనే ఆయనతో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే వస్తాయి అని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు.  ఇరి వీరిద్దరిలో సినిమా ఎప్పుడు రానుందా అని వర్మ, ఉపేంద్ర అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top