ఆర్జీవీ మరో సంచలనం.. భార్యలపై వెబ్‌ సీరీస్‌

Ram Gopal Varma Announced Bharyalu New Web Series - Sakshi

RGV Bharyalu New Web Series: భరతముని, కేశవదాసు, జయదేవుడు, వనమాలి లాంటి ఇంకా ఎందరో శతాబ్దాల క్రిందటి మహానుభావులు.. లోకంలో ఎన్ని రకాల స్రీలు ఉన్నారో వాళ్ల వాళ్ల వర్గీకరణని సుధీర్ఘంగా విపులీకరించారు. కానీ, ఆ స్త్రీల అసలు స్వరూపం భార్యలుగా మారినప్పుడే బయటకొస్తుంద’అంటున్నాడు ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. సంచలన సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే ఆర్జీవీ.. తాజాగా భార్యలు, వాళ్లలో రకాలపై ఓ వెబ్‌ సిరీస్‌ తీయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు.

త్వరలోనే ఈ సిరీస్‌ని తెరకెక్కించబోతున్నట్లు ఆర్జీవీ వెల్లడించాడు. ఈ సిరీస్‌లో  ‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆర్జీవీ సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశారు. ఇప్పటికాలంలో ఉన్న భార్యల గురించి అందరికీ తెలియజేస్తూ ‘రకరకాల భార్యలు’ అనే పేరుతో సిరీస్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. సిరీస్‌లోని ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కోరకం భార్యని చూపించనున్నట్లు వివరించారు. ఒక మగవాడికి ఎలాంటి భార్య దొరికితే అతని బతుకు ఎలా తయారవుతోందో చూపించడమే ఈ సిరీస్‌ ముఖ్య ఉద్దేశ్యమని ఆర్జీవీ పేర్కొన్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top