Rakul Preet Singh Sarees Cost: రకుల్‌ కట్టుకున్న ఈ చీర ధరెంతో తెలుసా? - Sakshi
Sakshi News home page

రకుల్‌ కట్టుకున్న ఈ చీర ధరెంతో తెలుసా?

Jul 11 2021 11:17 AM | Updated on Jul 11 2021 4:39 PM

Rakul Preet Singh Says Comfort Is Her Priority Than Expensive Ones - Sakshi

తను నటించే పాత్రల ఎంపిక పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటుందో ధరించే దుస్తుల విషయంలోనూ అంతే శ్రద్ధ పెడుతుంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. అందుకే ఫ్యాషనే ఆమెను ఫాలో అవుతుంది. ఆ ట్రెండీ గర్ల్‌ ఫ్యాషన్‌ టేస్ట్‌ .. ఆమె ఫేవరెట్‌ బ్రాండ్‌ ఏంటో చూద్దాం.. 

లిమరిక్‌..
ఇద్దరు డిజైనర్స్‌ అబిర్, నాన్కీ కలసి స్థాపించిన సంస్థే లిమరిక్‌. లేత రంగులతో అందమైన డిజైన్స్‌ను రూపొందించడం వీరి ప్రత్యేకత. హ్యాండ్‌ పెయింటింగ్, సింపుల్‌ అల్లికలకు ఇంపార్టెన్స్‌ ఇస్తారు. ఇందుకోసం జైపూర్, సూరత్, ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది కళాకారులను ప్రత్యేకంగా నియమించారు కూడా. అనతికాలంలోనే ఆ డిజైన్స్‌ గుర్తింపు పొంది అంతర్జాతీయ స్థాయికి చేరాయి. ప్రస్తుతం అమెరికా, లండన్‌లోనూ దీనికి బ్రాంచీలున్నాయి. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లలో లిమరిక్‌ డిజైన్స్‌ లభిస్తాయి. 

ఆమ్రపాలి జ్యూయెలరీ 
రాజీవ్‌ అరోరా, రాజేష్‌ అజ్మేరా అనే మిత్రులు కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియం ప్రారంభించారు. ఇక్కడ వివిధ సంప్రదాయ ఆభరణాలను చూడొచ్చు. నచ్చితే కొనుగోలూ చేసుకోవచ్చు. అయితే ధర మాత్రం లక్షల్లోఉంటుంది. అందుకే ఆ యాంటిక్‌ జ్యూయెలరీకి రిప్లికా డిజైన్స్‌ను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చారు. ఆమ్రపాలి ట్రైబల్‌ డిజైన్‌ ఆభరణాలకు పెట్టింది పేరు. చాలా మంది సెలబ్రిటీస్‌ వీటిని ఇష్టపడతారు. ఆన్‌లైన్‌లోనూ ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. 

బ్రాండ్‌ వాల్యూ 
చీరబ్రాండ్‌: లిమరిక్‌  బై అబిర్‌ అండ్‌ నాన్కీ
ధర : రూ. 9,900

జ్యూయెలరీ.. 
బ్రాండ్‌: ఆమ్రపాలి జ్యూయెల్స్‌
ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 
ఎంత విలువైనది ధరించినా, అది మనకు ఇబ్బంది కలిగిస్తుంటే అందంగా కనిపించలేం. అందుకే నేను ఖరీదైన వాటికంటే కంఫర్ట్‌నిచ్చే దుస్తులు, ఆభరణాలనే ధరిస్తా. కంఫర్ట్‌ కాన్ఫిడెన్స్‌ను ఇస్తుంది-  రకుల్‌ 

- దీపిక కొండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement