Rajisha Vijayan: రవితేజ సెట్‌కి వస్తే మెరుపులే.. ఎనర్జీతో నిండిపోతుంది

Rajisha Vijayan Talk About Rama Rao On Duty Movie - Sakshi

నేను నార్త్ ఇండియాలో పెరిగాను. రవితేజ సినిమాలు హిందీ డబ్బింగ్ లో చూసేదాన్ని. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ ఆ రోజుల్లోనే రవితేజ సినిమాలు నార్త్‌లో బాగా చూసేవారు. అలాంటి హీరోతో పని చేయడం గొప్ప అనుభవం. రవితేజ  గ్రేట్ మాస్ హీరో, సూపర్ స్టార్. ఆయన సెట్స్ కి వస్తే ఒక మెరుపులా ఉంటుంది. మొత్తం ఎనర్జీతో నిండిపోతుంది. సెట్స్ లో అందరినీ సమానంగా చూస్తారు’ హీరోయిన్‌ రజిసా విజయన్‌ అన్నారు. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా యంగ్‌ డైరెక్టెర్‌ శరత్‌ మండవ తెరకెక్కిస్తున్న తాజాగా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో  రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జులై 29న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్‌ రజిషా విజయన్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

► రామారావు ఆన్ డ్యూటీ(Rama Rao On Duty) లో మాళిని అనే పాత్రలో కనిపిస్తా. శరత్  అద్భుతమైన కథ చెప్పారు. నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఒక భాషలో పరిచయమౌతున్నపుడు బలమైన కథ, పాత్ర కావాలని ఎదురుచూశాను. నేను ఎదురుచుసిన పాత్ర ఈ సినిమాతో దక్కింది. మాళిని పాత్ర చాలా అందంగా బలంగా   ఉంటుంది. ఇంతమంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా ఉంది.

► రామారావు ఆన్ డ్యూటీ  మాస్ ఫిల్మ్‌. ఇందులో చాలా ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్, యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. అదే సమయంలో బలమైన కథ  ఉంది. వినోదం పంచుతూనే ఆలోచన రేకెత్తించే సినిమా ఇది. ఇన్ని ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా తీయాలంటే దర్శకుడిలో చాలా క్లారిటీ ఉండాలి. అంత చక్కని క్లారిటీ వున్న దర్శకుడు శరత్. మంచి సాంకేతిక విలువలతో చాలా మంచి క్యాలిటీతో ఈ సినిమాని రూపొందించారు. 

► పరిశ్రమలో వేరైనా అందరూ తీసేది సినిమానే. టెక్నిక్ ఒక్కటే. నటన కూడా ఒకటే. మిగతా పరిశ్రమలతో పోలిస్తే  తెలుగులో సినిమాల ఎక్కువ బడ్జెట్  ఉంటుంది. పెద్ద కాన్యాస్ లో సినిమాకు తెరకెక్కుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుకుంటే ఇక్కడ థియేటర్స్, ఆడియన్స్ ఎక్కువ.       

► సినిమా అనేది అల్టీమేట్ గా థియేటర్ ఎక్స్ పిరియన్స్. మమ్ముటి గారు ఒక సినిమా షూటింగ్  చేస్తున్నపుడు ఎలా వస్తుందో కనీసం మోనిటర్ కూడా చూడలేదు. కారణం అడిగితే.. ''నేను యాక్ట్ చేస్తుంది మానిటర్ కోసం కాదు .. బిగ్ స్క్రీన్ పై ఎలా వుంటుందో అనేది చూస్తాను''అని చెప్పారు. థియేటర్ ఇచ్చే అనుభవం వేరు. 'రామారావు ఆన్ డ్యూటీ' లాంటి భారీ చిత్రాన్ని అందరూ థియేటర్ లోనే చూడాలి. ఈ చిత్రం అన్ని ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. ఆలోచింపజేస్తుంది.

► నేను నటించిన మలయంకున్జు పాటు మరో నాలుగు మలయాళం సినిమాలు విడుదల కానున్నాయి. మరో రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top