రజినీకాంత్ వెట్టైయాన్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బిగ్ షాక్! | Rajinikanth Vettaiyan Advance Tickets Booking, Trolls Started By Netizens | Sakshi
Sakshi News home page

రిలీజ్‌కు ముందే రజినీకాంత్‌కు షాక్.. నెట్టింట మొదలైన ట్రోలింగ్!

Oct 9 2024 5:38 PM | Updated on Oct 9 2024 5:45 PM

Rajinikanth Vettaiyan Advance Tickets Booking, Trolls Started By Netizens

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్‌  దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటివరకు తమిళ వర్షన్‌ కేవలం రూ.10.2 కోట్ల మేర టికెట్స్ బుకింగ్స్ మాత్రమే పూర్తయ్యాయి. తెలుగులో అయితే ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం రూ.74 లక్షలు మాత్రమే వసూళ్లు రానున్నాయి. హిందీలో మరింత దారుణంగా రూ.93 వేల అడ్వాన్స్ బుకింగ్‌ బిజినెస్ జరిగింది. ఓవరాల్‌గా చూస్తే ఇండియా వ్యాప్తంగా రూ.11 కోట్ల వరకు ముందస్తు టికెట్ బుకింగ్స్‌ అయినట్లు తెలుస్తోంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో వెట్టైయాన్‌కు క్రేజ్ తగ్గడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. ట్విటర్‌లో ఏకంగా వెట్టైయాన్ డిజాస్టర్ అంటూ హ్యాష్‌ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై నెట్టింట తెగ చర్చ మొదలైంది. అసలే ఈ మూవీ కోసం సూర్య నటించిన కంగువా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నప్పటికీ అడ్వాన్స్  బుకింగ్స్‌ పెద్దగా జరగకపోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మొదటి రోజు వంద కోట్ల రాబట్టడం కష్టంగానే కనిపిస్తోంది.  ఈ చిత్రంలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement