Nayanthara - Vignesh Shivan Wedding: గ్రాండ్‌గా నయన్‌-విఘ్నేశ్‌ల పెళ్లి.. హాజరైన రజనీ, షారుక్‌

Rajinikanth And Shah Rukh Khan Attends Nayanthara, Vignesh Shivan Wedding - Sakshi

కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గురువారం(జూన్‌ 9) తెల్లవారు జామున 2.22 గంటలకు నయన్‌-విఘ్నేశ్‌లు ఏడడుగులు వేశారు. మహాబలిపూరంలోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు సైతం హజరైనట్లు తెలుస్తోంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌లు పెళ్లికి హజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. 

చదవండి: ఇకపై అధికారికంగా.. నయన్‌పై విఘ్నేశ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రజనీకాంత్‌ కారు దిగి లోపలికి వెళుతున్న ఫొటోను ఒకటి బయటక రాగా.. పెళ్లిలో క్రిమ్‌ కలర్‌ షూట్‌, వైట్‌ షర్డ్‌ ధరించి షారుక్‌ స్టైలిష్‌ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. ఈ ఫొటోను షారుక్‌ మేనేజర్‌ పూజా దద్దాని షేర్‌ చేసింది. షారుక్‌తో పాటు డైరెక్టర్‌ అట్లీ కూడా హజరయ్యాడు. అంతేకాదు కోలీవుడ్‌ చెందిన స్టార్‌ హీరోలు అజిత్‌, కార్తీ, విజయ్‌తో పాటు టాలీవుడ్‌, శాండల్‌వుడ్‌కి చెందిన సినీ సెలబ్రెటీలు సైతం పెళ్లికి హజరైనట్లు సమాచారం. కాగా పెళ్లికి కొద్ది క్షణాల ముందు విఘ్నేశ్ శివన్‌ నయన్‌పై ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. తను వధువుగా ముస్తాబై వివాహ వేదికపై నడుచుకుంటూ వస్తుంటే చూడాలని ఆతృతుగా ఎదురు చూస్తున్నానంటూ కాబోయో భార్య గురించి ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశాడు విఘ్నేశ్‌. అంతేకాదు ఈ సందర్భంగా తన ఆనందాన్ని, ప్రేమను నయన్‌కు అంకితం ఇస్తున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు విఘ్నేశ్‌. 

చదవండి: 200 సినిమాలు చేశా.. నేను చేసిన బెస్ట్‌ తండ్రి పాత్ర ఇదే!  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top