నా కెరీర్‌లో స్పెషల్‌ ఫిల్మ్‌ ఇది | Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లో స్పెషల్‌ ఫిల్మ్‌ ఇది

Published Sun, Oct 15 2023 4:32 AM

Rajendra Prasad at Krishnarama teaser launch event - Sakshi

రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రధారులుగా రాజ్‌ మదిరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘#కృష్ణారామా’. వెంకట కిరణ్, కుమార్‌ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22 నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సందర్భంగా టీజర్‌ రిలీజ్‌ వేడుకలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘సోషల్‌ మీడియా నేపథ్యంలో ఓ రిటైర్డ్‌ ఓల్డ్‌ పెయిర్‌ కోణంలో సాగే చిత్రం ఇది. అన్ని తరాల ప్రేక్షకులకు తగ్గట్లుగా నటించే అవకాశాలు నాకు వస్తుండటం నా అదృష్టం. ఈ తరానికి చెందిన కథ ఇది. నా కెరీర్‌లో స్పెషల్‌ ఫిల్మ్‌’’ అన్నారు. ‘‘మోడ్రన్‌ సబ్జెక్ట్‌తో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు గౌతమి. ‘ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు రాజ్‌ మదిరాజు.

Advertisement
 
Advertisement