Raghava Lawrence Rudrudu Movie Release Date Announced, Deets Inside - Sakshi
Sakshi News home page

Raghava Lawrence Rudrudu Movie: 'రుద్రుడు'గా రాఘవ లారెన్స్.. ఆ పండుగకే రిలీజ్‌

Jul 4 2022 10:23 AM | Updated on Jul 4 2022 11:16 AM

Raghava Lawrence Rudrudu Movie Release Date Announced - Sakshi

దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్‌. ఎంతోమంది హీరోలకు నృత్యం నేర్పించిన రాఘవ.. డైరెక్టర్‌గా హార్రర్‌ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'రుద్రుడు'.

Raghava Lawrence Rudrudu Movie Release Date Announced: దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్‌. ఎంతోమంది హీరోలకు నృత్యం నేర్పించిన రాఘవ.. డైరెక్టర్‌గా హార్రర్‌ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'రుద్రుడు'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌. ఫైవ్‌స్టార్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై కతిరేషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 

తాజగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 23న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపింది. 'యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందింన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది.' అని చిత్రబృందం పేర్కొంది. శరత్‌ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. 

చదవండి: కమల్‌ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ?
కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్‌ నటుడు మృతి

Advertisement
 
Advertisement
Advertisement