
Radhe Shyam Making Video: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లెటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’కోసం ఆయన డైహార్ట్ ఫ్యాన్స్ కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు.. అప్పుడు అంటూ పలుమార్లు విడుదలను వాయిదా వేసినా చిత్రబృందం.. ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యారు. విడుదలకు తేది దగ్గరపడుతుండటంతో.. ప్రమోషన్స్ స్పీడ్‌ని కూడా పెంచేశారు. ఇందులో భాగంలో తాజాగా రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. అలాగే దర్శకుడు రాధాకృష్ణతో పాటు పలువురు నటులు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.ఇలా ప్రతి రోజు ఏదోఒక రకంగా ‘రాధేశ్యామ్’ని ప్రమోట్ చేస్తుంది చిత్రబృందం.
ఇదిలా ఉంటే... తాజాగా రాధేశ్యామ్ మేకింగ్ వీడియోని జనాల్లోకి వదిలారు. రాధేశ్యామ్’ సాగా పేరుతో ఈ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే.. ‘రాధేశ్యామ్’ కోసం మేకర్స్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. సినిమాని ఎంత బాగా చిత్రీకరించారో వీడియో చూస్తే తెలిసిపోతుంది. యూరప్‌లోని అందమైన లొకేషన్స్, మంచు ప్రాంతాలతో చాలా కష్టపడి సినిమా షూటింగ్ జరిపారు. అలాగే 1970 కాలం నాటి ఇటలీని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. కరోనా కారణంగా యూరప్‌లో షూటింగ్ ఆగిపోవడంతో.. ఇండియాలో యూరప్ సెట్ వేసి మరీ షూటింగ్ చేశారు. ఇటాలీ సెట్, సినిమాకి మ్యూజిక్ అందివ్వడం.. ఇలా అన్ని వీడియోలో చూపించారు. ఈ మేకింగ్ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచేఏసింది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మరో కొత్త లోకానికి తీసుకెళ్తుందని చిత్రబృందం గట్టిగా చెబుతోంది. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.