Procuder Natti Kumar Comments On Agent Movie Theatres Issue - Sakshi
Sakshi News home page

హీరోను తొక్కడానికే ఈ ప్రయత్నం.. నాగార్జున ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు: నిర్మాత

Apr 28 2023 2:17 PM | Updated on Apr 28 2023 3:02 PM

Procuder Natti Kumar comments On Agent Theatres Issue - Sakshi

టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీని ఒక్కరే తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అఖిల్ ఏజెంట్‌ మూవీకి థియేటర్లు ఇవ్వకుండా.. తమిళ మూవీకి కేటాయిస్తారా అని ప్రశ్నించారు. హీరోలను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా నట్టి కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో రాజకీయాలు, ఎత్తుగడలు ఉన్నాయి. వాటిని అధిగమించడం అఖిల్ వల్ల అవుతుందా? అక్కినేని కుటుంబం వల్ల అవుతుందా? అక్కినేని కుటుంబం చాలా సైలెంట్‌. ఒక హీరోను తొక్కడానికి ఒక అగ్ర నిర్మాత థియేటర్లను బ్లాక్ చేశారు. ఏజెంట్‌ రిలీజ్‌ రోజే పొన్నియన్‌ సెల్వన్‌ 2 కూడా రిలీజ్‌ అయింది. మణిరత్నం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ మాకు తెలుగు సినిమా గొప్ప. ఏజెంట్ మూవీకి నిన్నటి దాకా డిస్ట్రిబ్యూటర్లు కూడా దొరకని పరిస్థితి ఉంది.' అని అన్నారు.

ఆయన మాట్లాడుతూ.. 'మోనోపాలి అనేది కరెక్ట్ కాదు. ఏజెంట్‌కు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. మీకే ఇలా జరిగితే మాలాంటి వారి పరిస్థితేంటి? తెలంగాణలో ఇప్పటికే చిన్న సినిమాలను చంపేశారు. మార్కెట్ మొత్తం పడిపోతోంది. దసరాకు కలెక్షన్స్ వచ్చాయి అంటున్నారు. మరి డబ్బులు ఎవరికెళ్లాయి. ప్రొడ్యూసర్‌కు, కొన్నవారికి ఇంకా డబ్బులు రావాలి. నిజమైన నిర్మాతలకు, బయ్యర్లకు డబ్బులు ఎందుకు రావడం లేదు. తెలుగు, తమిళం కంటే మనం తెలుగుకే ప్రాధాన్యత ఇవ్వాలి. వైజాగ్‌ అంతటా పొన్నియిన్ సెల్వన్‌-2 ఆడుతోంది. అక్కడ థియేటర్లు మొత్తం బ్లాక్ చేశారు. గతిలేని పరిస్థితుల్లో ఎగ్జిబ్యూటర్లు ఆ సినిమా వేయాల్సి వస్తోంది. మోనోపాలి వల్ల ఇండస్ట్రీ నాశనమవుతోంది. దీనిపై చర్చించాలి' అన్నారు నట్టి కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement