లాస్‌ ఏంజెల్స్‌ టు హైదరాబాద్‌ | Priyanka Chopra in Hyderabad: project with SS Rajamouli and Mahesh Babu | Sakshi
Sakshi News home page

లాస్‌ ఏంజెల్స్‌ టు హైదరాబాద్‌

Jan 18 2025 2:54 AM | Updated on Jan 18 2025 2:54 AM

Priyanka Chopra in Hyderabad: project with SS Rajamouli and Mahesh Babu

ప్రముఖ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. అందులో విషయం ఏముందీ అనుకోవచ్చు. సింగర్, యాక్టర్‌ నిక్‌ జోనాస్‌తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో స్థిరపడ్డారు ప్రియాంక. ఇప్పుడు ఇలా హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి కారణం ఏంటి? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ఆమె భాగ్యనగరానికి చేరుకున్నారని టాక్‌. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్‌ చేశారని భోగట్టా. ప్రియాంకా చోప్రా లాస్‌ ఏంజెల్స్‌ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే రూమర్లు వినిపిస్తున్నాయి. మరి... ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement