Prithviraj Sukumaran: తెరపైకి బిస్కెట్‌ కింగ్‌ బయోపిక్‌.. ప్రధాన పాత్రలో ఎవరంటే ?

Prithviraj Sukumaran New Web Series On Biscuit King Rajan Pillai - Sakshi

Prithviraj Sukumaran New Web Series On Biscuit King Rajan Pillai: వెండితెరపై ప్రముఖుల జీవిత చరిత్రలు బయోపిక్‌లుగా వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. డర్టీ పిక్చర్‌ సినిమా నుంచి స్కామ్‌ 1992 వెబ్ సిరీస్‌ వరకు ఎన్నో జీవితగాథలు తెరపై, ఓటీటీల్లో సందడి చేశాయి. తాజాగా 'బిస్కెట్‌ కింగ్‌'గా పేరొందిన రాజన్‌ పిళ్లై జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌ రానుంది. ఈ సిరీస్‌లో మలయాళీ దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పృథ్వీరాజ్‌ దర్శకుడిగా బాలీవుడ్‌లో చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇది. 

పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన మోహన్‌ లాల్‌ హీరోగా నటించిన 'లూసీఫర్‌' (మలయాళం) చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా 'గాడ్‌ ఫాదర్‌' పేరుతో రీమేక్‌గా మోహన్‌ రాజా తెరకెక్కిస్తున‍్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ నటించిన మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియమ్‌' సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాను పవన్‌ కల్యాణ్‌, రానా హీరోలుగా భీమ‍్లా నాయక్‌గా తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రాజన్‌ పిళ్లై ఒక వ్యాపారవేత్త. బ్రిటానియా ఇండస్ట్రీలో వాటాదారు. 1970లో సింగపూర్ కేంద్రంగా తన వ్యాపారాన్ని కొనసాగించి బిస్కెంట్‌ కింగ్‌గా ఎదిగారు. 1993లో సింగపూర్ వాణిజ్య వ్యవహారాల శాఖ అతనిపై విచారణ చేపట్టింది. సింగపూర్‌ ప్రభుత్వ సమాచారం మేరకు భారత పోలీసులు 1995 జూలై 4న కొత్త ఢిల్లీలోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్‌ జైలుకు పంపించారు. అనారోగ్యంతో రాజన్ పిళ్లై కస్టడీలోనే మరణించడంతో అప్పట్లో సంచలనమైంది. కె. గోవిందన్‌ కుట్టితో కలిసి రాజన్ సోదరుడు రామ్మోహన్‌ పిళ్లై 'ఏ వేస్టెడ్‌ డెత్‌: ది రైజ్‌ అండ్‌ ఫాల్ ఆఫ్‌ రాజన్‌ పిళ్లై' పేరుతో పుస్తకం కూడా రాశారు. 2001లో విడుదలైన ఈ పుస్తకం ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top