శ్రీరాముడిపై వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన ప్రకాష్‌ రాజ్‌ | Prakash Raj Clarifies His Comments On Lord Sri Rama | Sakshi
Sakshi News home page

శ్రీరాముడిపై వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన ప్రకాష్‌ రాజ్‌

Apr 19 2026 10:54 AM | Updated on Apr 19 2026 11:42 AM

Prakash Raj Clarifies His Comments On Lord Sri Rama

శ్రీరాముడు, హిందూ ధర్మం గురించి సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పాటు నెట్టింట వైరల్‌ అయ్యాయి. తాజాగా ఈ అంశం గురించి ఆయన వివరణ ఇచ్చారు. కొందరు రాజకీయ నాయకులు చేసే కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. తన మాటలను మరోసారి పూర్తిగా వినాలని ఆయన కోరారు.

సోషల్‌ మీడియా వేదికగా ప్రకాష్‌ రాజ్‌ తాజాగా ఒక వీడియో ద్వారా ఇలా వివరణ ఇచ్చారు.  'ఒక సాహితీ వేడుకలో నేను చేసిన ప్రసంగంలో కొన్ని మాటలను మాత్రమే తీసుకుని  అదేపనిగా కొందరు వక్రీకరించారు. నేనేదో అవతారపురుషుడు శ్రీరాముడి గురించి వెటకారం చేశానని వైరల్‌ చేశారు. హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడానని అంటున్నారు. నేను అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమిస్తాను. ఒకరిని తక్కువ చేసే అలాంటి అవసరం నాకు లేదు. కానీ, కొందరు మతోన్మాధంతో ధర్మాన్ని అడ్డుపెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్నారు. అలాంటి వారు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక.. నన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.  నా గురించి ఇలాగే తప్పుగా వాగుతూ ఉంటే నేను కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీ పని మీరు చూసుకోండి.' అంటూ ఆయన వివరణ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement