
‘ఒక నేనే... నాకు చుట్టూ నేనే.. ఒకడైనా.. ఒంటరోణ్ణి కానే... ధీరుడినే.. యోధుడినే...’ అంటూ మొదలవుతుంది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని ‘భైరవ’ యాంథమ్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్ అండ్ ఫ్యూచ రిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్ , కమల్‌హాసన్ , దీపికా పదుకొనె, దిశాపటానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
ఈ మూవీలోని ‘భైరవ’ యాంథమ్ ఆడియోను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. పూర్తి వీడియో సాంగ్ నేడు విడుదలవుతోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి, కుమార్ లిరిక్స్ అందించారు. ‘నాకు నేనే కర్త..కర్మ..క్రియ..ఒక నేనే వేల సైన్యమయ్యా...నా గమనం.. నిత్య రణం.. కణ కణ కణం..అనుచర గణం..’’ అంటూ సాగే ‘భైరవ’ యాంథమ్‌ను పంజాబీ నటుడు–సింగర్ దిల్జీత్ సింగ్, దీపక్ బ్లూ, సంతోష్ నారాయణన్ పాడారు.