సెప్టెంబర్ 17న శ్రీనివాస్‌ రెడ్డి ' ప్లాన్ బి'

Plan B movie To Release On 17th September - Sakshi

శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్లాన్‌ బి’. కేవీ రాజమహి దర్శకత్వంలో ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో డింపుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కి, టీజర్ , ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదిని ప్రకటించారు మూవీ మేకర్స్‌.

ఈ సినిమా సెప్టెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ధియేటర్ లలో ఎంతో ఘనంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ వండర్ చిత్రంగా అందరిని రెండు గంటలు చాలా థ్రిల్ కి గురి చేస్తుందని దర్శక నిర్మాతలు చెప్తున్నారు.  మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వర పాటలు అందించగా, శక్తికాంత్ కార్తీక్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top