బిగ్‌బాస్‌ తర్వాత దారుణ పరిస్థితులు, డిప్రెషన్‌కు వెళ్లిపోయా: నటి | Pavitra Punia Faced Financial Constraints Post Bigg Boss Exit | Sakshi
Sakshi News home page

Pavitrra Punia: బిగ్‌బాస్‌ తర్వాత ఎన్నో ఇబ్బందులు.. ఉన్న డబ్బంతా అయిపోయింది!

Feb 2 2024 12:07 PM | Updated on Feb 2 2024 12:57 PM

Pavitra Punia Faced Financial Constraints Post Bigg Boss Exit - Sakshi

రియాలిటీ షో నుంచి బయటకు వచ్చాక పని దొరకడమే కష్టమైంది. నా సేవింగ్స్‌ అన్నీ వాడేశాను. బిగ్‌బాస్‌ ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చైపోయాయి. నా దగ్గర లెక్కపెట్టలేనం

బిగ్‌బాస్‌ షోతో కావాల్సినంత గుర్తింపు వస్తుంది. బోలెడంత డబ్బు వస్తుంది. కానీ తర్వాత? అవకాశాలు లేక నానాపాట్లు పడ్డవారే ఎక్కువున్నారు! చాలామంది బుల్లితెర, వెండితెరపై నామరూపాల్లేకుండా పోయారు. కొద్దిమంది మాత్రమే నిలదొక్కుకున్నారు. అయితే బిగ్‌బాస్‌ షో తర్వాత తను చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానంటోంది పవిత్ర పూనియా. ఈ బుల్లితెర నటి 2009లో ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా మూడో సీజన్‌లో, 2020లో బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో పాల్గొంది. తాజాగా ఆమె తను ఫేస్‌ చేసిన కష్టాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఉన్నదంతా అయిపోయింది
నేను బిగ్‌బాస్‌ షోకి వెళ్లినప్పుడు కోవిడ్‌తో అంతా అల్లకల్లోలంగా ఉంది. రియాలిటీ షో నుంచి బయటకు వచ్చాక పని దొరకడమే కష్టమైంది. నా సేవింగ్స్‌ అన్నీ వాడేశాను. బిగ్‌బాస్‌ ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చైపోయాయి. నా దగ్గర లెక్కపెట్టలేనంత డబ్బు ఉండాలని నేను కోరుకోలేదు. కానీ నాకు సడన్‌గా ఏదైనా అయి ఆస్పత్రిలో ఉంటే అమ్మను రూపాయి అడక్కుండా నా బిల్‌ నేనే కట్టుకోగలిగేంత మనీ ఉంటే చాలు.

డిప్రెషన్‌కు లోనయ్యా
నేను షో నుంచి వచ్చిన నెల రోజులకు నాన్నకు యాక్సిడెంట్‌ అయింది. దీని వల్ల ఏడాదిన్నరపాటు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పలేదు. దీనివల్ల డిప్రెషన్‌కు లోనయ్యాను. నా జీవితాన్ని చాలించాలనుకున్నాను. ఆ సమయంలో కుటుంబం నాకు అండగా నిలిచింది. ఆ చీకటి రోజుల నుంచి బయటపడేలా చేసింది' అని చెప్పుకొచ్చింది. కాగా పవిత్ర ప్రస్తుతం 'ఇష్క్‌ కీ దస్తాన్‌-నాగమణి' అనే సీరియల్‌లో నటిస్తోంది.

నోట్‌: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: ప్రేక్షకులను భయంతో ఉలిక్కిపడేలా చేసిన చిత్రం.. సైలెంట్‌గా ఓటీటీలోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement