'పరాక్రమం' టీజర్‌ విడుదల.. టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచిన విశ్వక్ సేన్ | Sakshi
Sakshi News home page

'పరాక్రమం' టీజర్‌ విడుదల.. టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచిన విశ్వక్ సేన్

Published Sun, May 26 2024 11:44 AM

Parakramam Official Teaser Out Now


గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం ‘పరాక్రమం’. 'మాంగల్యం' మూవీ ఫేమ్‌ బండి సరోజ్‌ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్‌తో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.  తాజాగా పరాక్రమం సినిమా టీజర్‌ కార్యక్రమాన్ని మేకర్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకులు బుచ్చిబాబు, జ్ఞానసాగర్ ద్వారక, నిర్మాత ఎస్ కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు.  వారి చేతుల మీదుగా పరాక్రమం టీజర్‌ను విడుదల చేశారు. 

తన సొంత బ్యానర్ బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ ద్వారా  ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ చిత్రం లో శాస్త్రీయ నృత్య కళాకారిణి శృతి సమన్వి మరియు నాగ లక్ష్మి హీరోయిన్లుగా నటించారు. మరో 50 మంది నూతన నటి నటులు పరిచయం కాబోతున్నారు. వీళ్లలో చాలామంది థియేటర్ ఆర్టిస్ట్ లు పౌర్ణమి, 100% లవ్ లాంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ గా పనిచేసిన వెంకట్ ఆర్ ప్రసాద్ పరాక్రమం చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement