Jr.NTR 31 First Look: Interesting Update on Prashanth Neel - Sakshi
Sakshi News home page

#NTR31: ప్రశాంత్‌ నీల్‌-ఎన్టీఆర్‌ మూవీ అప్‌డేట్‌, మాస్‌లుక్‌లో తారక్‌

May 20 2022 12:30 PM | Updated on May 20 2022 1:01 PM

NTR31: Interesting Update On Prashanth Neel, Jr NTR Movie - Sakshi

రక్తంతో తడిచిన నేల మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఆయన నేల.. ఆయన వారసత్వం మాత్రమే గుర్తుంటాయి. అతని రక్తం కాదు’ అంటూ ప్రశాంత్‌ నీల్‌ రాసుకొచ్చాడు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా వరుసగా ఆయన సినిమాల అప్‌డేట్‌ను వదులుతున్నారు. ఇప్పటికే తారక్‌ పలు డైరెక్టర్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ పూర్తి చేసుకోవడం తన తదుపరి ప్రాజెక్ట్స్‌ను వరసగా ప్రకటిస్తున్నాడు. ఇక తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తుండగా.. 31వ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌ను కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌తో చేస్తున్నాడా? లేక ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో చేస్తున్నాడా? అనేది సస్పెన్స్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తారక్‌ బర్త్‌డే సందర్భంగా దీనిపై అప్‌డేట్‌ ఇచ్చారు.

చదవండి: త్రివిక్రమ్‌, మహేశ్‌ సినిమాలో మరో స్టార్‌ హీరో!

ఎన్టీఆర్‌ 31(NTR31) చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించబోతున్నాడని స్పష్టమైంది. ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా ప్రశాంత్‌ నీల్‌ షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ సంబంధించిన ఫస్ట్‌ పోస్టర్‌ను వదిలారు. ‘హ్యాపీబర్త్‌డే ఎన్టీఆర్‌ 31’ ప్రశాంత్‌ నీల్‌ ట్యాగ్‌లైన్‌తో ఉన్న పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో తారక్‌ ఇంటెన్స్‌ లుక్‌లో కనిపించాడు. ఈ పోస్ట్‌కు ‘రక్తంతో తడిచిన నేల మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఆయన నేల.. ఆయన వారసత్వం మాత్రమే గుర్తుంటాయి. అతని రక్తం కాదు’ అంటూ ప్రశాంత్‌ నీల్‌ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ చూసిన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ NTR31 అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ఎన్టీఆర్‌ లుక్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.

చదవండి: మలైకాతో పెళ్లిపై ఆసక్తిగా స్పందించిన అర్జున్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement