క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి మేకోవర్‌కైనా ఎన్టీఆర్ సై అంటారు. అందుకు ఉదాహరణలుగా ‘అరవింద సమేత వీర రాఘవ, ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలను చెప్పుకోవచ్చు. తాజా చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) కోసం ఈ చాలెంజ్‌ను స్వీకరించారని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభ సమయంలో కాస్త హెవీ బాడీ లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్ ఇటీవలి కాలంలో చాలా సన్నగా కనిపించారు. హీరో క్యారెక్టరైజేషన్ కోసమే ఎన్టీఆర్ ఇలా స్లిమ్ లుక్‌లోకి మారిపోయారని సమాచారం. ఈ లుక్ కోసం ఎన్టీఆర్ ఏడు వారాల్లో పది కిలోల బరువు తగ్గారట.
నిపుణుల సమక్షంలో ప్రతిరోజూ గంటన్నర పాటు వ్యాయామం, లో ప్రోటీన్ డైట్‌ను ఫాలో అవుతూ లీన్ లుక్‌లోకి మారిపోయారని టాక్. ఇలా సినిమా షూట్ ప్రారంభంలో కాస్త హెవీ బాడీ లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత లీన్ లుక్‌లోకి మారారంటే... ‘డ్రాగన్’లో ఈ హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయా? అనే చర్చ జరుగుతోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టోవినో థామస్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోందని టాక్. నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.


